IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!అండర్-19 ఆసియా కప్ 2026 షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఒమన్ వేదికగా నవంబర్ 5 నుంచి 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ నవంబర్ 5న టోర్నీ ప్రారంభ రోజే జరగనుంది.
ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ ఉండగా, గ్రూప్-బీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, మలేషియా ఉన్నాయి. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ టోర్నీ మంచి అవకాశం కానుంది. భారత యువ జట్టు టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!