Yashasvi Jaiswal Creates Unwanted Record: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో అతడి ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలన్నింటిలోనూ డకౌట్ అయిన తొలి భారత రెగ్యులర్ బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. తన టెస్ట్ కెరీర్‌లో అతడు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు డకౌట్ అయ్యాడు.
జైస్వాల్ కంటే ముందు ఈ నాలుగు దేశాల్లోనూ డకౌట్ అయిన భారత ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అయితే వీరంతా ప్రధానంగా బౌలర్లే కావడం విశేషం. ఇప్పటివరకు ఈ జాబితాలో ఒక్క రెగ్యులర్ బ్యాటర్ కూడా లేడు. దీంతో SENA దేశాలన్నింటిలోనూ డకౌట్ అయిన తొలి భారత రెగ్యులర్ బ్యాటర్‌గా జైస్వాల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!



