IND vs UAE: ఆసియా కప్ టీ20లో భారత్ ఇవాళ యూఏఈతో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత్ బలమైన జట్టే అయినా, యూఏఈను తక్కువగా చూడలేం. ఇటీవల వారు బంగ్లాదేశ్‌పై సిరీస్ గెలిచారు. పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు భారత్ బలంగా ఆడాలని చూస్తోంది. శుభ్‌మన్ గిల్ తిరిగి రావడంతో ఆయన అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేస్తారు. తిలక్ వర్మ మూడో స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ నాలుగో స్థానంలో ఉంటారు. సంజూ శాంసన్‌కి అవకాశం తగ్గగా, జితేశ్ శర్మ ఫినిషర్‌గా ఆడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, బుమ్రా, అర్ష్ దీప్, అక్షర్ పటేల్‌తో జట్టు బలంగా ఉంది. చివరి స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది.
యూఏఈ చిన్న జట్టే అయినా పొట్టి ఫార్మాట్లలో అనుభవం ఉంది. మహ్మద్ వసీమ్, షరాఫు, అసిఫ్ ఖాన్ మంచి బ్యాటర్లు కాగా, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, మహ్మద్ రోహిద్ బౌలర్లుగా ఉన్నారు. భారత్‌ను ఓడించడం కష్టం కానీ పోటీ తప్పక ఇస్తారు. దుబాయ్‌లో కొత్త పిచ్‌లు బ్యాటర్లకు, పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నా మ్యాచ్‌కు ఎలాంటి వర్షం అంతరాయం లేదు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ.
Internal Links:
పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌లు, వివరాలు
8 ఏళ్ళ తర్వాత ఆసియా కప్ సొంతం..
External Links:
ఆసియా కప్‌లో నేడే భారత్ తొలి పోరు.. పసికూనతో గెలిచేనా..?