India Beat Pakistan Asian Games 2026

India Beat Pakistan Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌ 2026లో భారత్ మరో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులతో అదరగొట్టగా, తిలక్ వర్మ 22 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. వైభవ్ సూర్యవంశీ 15, సంజూ శామ్సన్ 2, ఇషాన్ కిషన్ 20, శ్రేయస్ అయ్యర్ 21, శివమ్ దూబే 27 పరుగులు చేశారు. దీంతో పాకిస్థాన్ ముందు 212 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. హసన్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులతో చివరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీశారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *