IPL Highest Team Scores

IPL Highest Team Scores: ఐపీఎల్ అంటే అభిమానులకు భారీ సిక్సర్లు, పరుగుల వర్షమే గుర్తుకు వస్తాయి. ఇటీవల సీజన్లలో బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడుతూ 250కి పైగా స్కోర్లు సాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ల జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2024లో ఆర్సీబీపై 287/3, 2025లో ఆర్ఆర్‌పై 286/6, అలాగే 2024లో ముంబైపై 277/6 స్కోర్లు చేసి టాప్ 3లో మొత్తం ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్, క్లాసెన్ వంటి హిట్టర్లతో జట్టు బలంగా ఉంది.

నాలుగో స్థానంలో కేకేఆర్ (272/7 vs ఢిల్లీ, 2024), ఐదో స్థానంలో మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్ (266/7 vs ఢిల్లీ) ఉంది. ఆరవ స్థానంలో ఆర్సీబీ 2013లో పూణేపై చేసిన 263/5 స్కోర్ ఉంది. ఏడో స్థానంలో పంజాబ్ కింగ్స్ (262/2 vs కేకేఆర్, 2024), ఎనిమిదో స్థానంలో ఆర్సీబీ (262/7 vs ఎస్‌ఆర్‌హెచ్, 2024), తొమ్మిదో స్థానంలో కేకేఆర్ (261/6 vs పంజాబ్, 2024), పదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (257/4 vs ముంబై, 2024) ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ప్రతి సీజన్‌లో బ్యాటింగ్ ప్రభావం పెరుగుతోందని, భవిష్యత్తులో 300 పరుగుల మార్క్ కూడా సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ల వర్షం.. ఎస్‌ఆర్‌హెచ్‌దే హవా, టాప్-10 లిస్ట్ ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *