ఫిన్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఛాలెంజర్ స్థాయి ఈవెంట్ మోటోనెట్ GP సిరీస్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తేజస్ షిర్సే బుధవారం పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ జాతీయ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇరవై ఒక్క ఏళ్ల షిర్సే 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌లో 13.41 సెకన్లతో విజయం సాధించి, 2017లో సిద్ధాంత్ తింగలయ నెలకొల్పిన 13.48 సెకన్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
