Noam Shazeer Leaves Google

Noam Shazeer Leaves Google: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి పెద్ద షాక్ తగిలింది. గూగుల్ ‘జెమిని AI’ మోడల్స్‌కు కో-లీడ్‌గా ఉన్న నోమ్ షాజీర్ అనూహ్యంగా గూగుల్‌ను వదిలి ప్రత్యర్థి సంస్థ ఓపెన్ AIలో చేరారు. ఆయన ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించారు. ఓపెన్ AI టీమ్‌తో పనిచేయడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ప్రపంచంలో ప్రముఖ AI నిపుణులలో ఒకరైన ఆయన వెళ్లిపోవడం గూగుల్‌కు పెద్ద నష్టంగా టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

షాజీర్ గూగుల్‌తో ఉన్న ప్రయాణం ఇంతకుముందు కూడా మారుతూ వచ్చింది. 2021లో గూగుల్‌ను వదిలి Character.AI అనే స్టార్టప్ ప్రారంభించారు. తర్వాత 2024లో గూగుల్ ఆయనను తిరిగి 2.7 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందంతో కంపెనీలోకి తీసుకుంది. కానీ ఇప్పుడు కేవలం రెండేళ్లలోనే మళ్లీ గూగుల్‌ను వదిలి ఓపెన్ AIకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన నిర్ణయం కష్టమైనదని షాజీర్ తెలిపారు. మరోవైపు, ఓపెన్ AI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఆయన చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. దీంతో AI రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *