Cash Withdrawal Surges: దేశంలో డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం కూడా మళ్లీ పెరుగుతోంది. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2026 జూన్లో ఏటీఎంల ద్వారా రూ.2.18 లక్షల కోట్లు, జూలైలో రూ.2.19 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.2.24 లక్షల కోట్ల నగదు ఉపసంహరణ జరిగింది. దీంతో వరుసగా మూడు నెలలు ఏటీఎం నగదు ఉపసంహరణ పెరిగింది. అలాగే 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు బ్యాంకుల నుంచి నెలకు సగటున రూ.7.3 లక్షల కోట్ల నగదు ఉపసంహరణ జరిగినట్లు నివేదిక పేర్కొంది.
దేశంలో ప్రస్తుతం సుమారు రూ.4 లక్షల కోట్ల అదనపు నగదు చలామణిలో ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. 2025 ఏప్రిల్లో ఆర్బీఐ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం 90 శాతం ఏటీఎంలలో రూ.100, రూ.200 వంటి చిన్న నోట్లు అందుబాటులో ఉంచడం కూడా నగదు ఉపసంహరణ పెరగడానికి ఒక కారణంగా పేర్కొంది. చిన్న చెల్లింపులు, రోజువారీ అవసరాలు, నగదు ఆధారిత లావాదేవీల కోసం ప్రజలు ఏటీఎంలను వినియోగిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఆగస్టులో రూ.2.24 లక్షల కోట్ల ఏటీఎం ఉపసంహరణ, చలామణిలో రూ.43 లక్షల కోట్ల నగదు ఉండటం దేశంలో నగదు వినియోగం ఇంకా గణనీయంగానే ఉందని చూపిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!