Gold and Silver Prices: అక్టోబర్ 1న కొత్త నెల ప్రారంభం రోజే బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. సెప్టెంబర్ 30తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.33 తగ్గి, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో గ్రాము రూ.14,924గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.13,680గా కొనసాగుతోంది.
అక్టోబర్ 1న వెండి ధర కూడా తగ్గింది. దేశవ్యాప్తంగా కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,35,000గా ఉంది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.235గా కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్