Bihar: బీహార్‌లోని జముయిలో విద్యార్థినిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించడంతో పోలీసులు చర్యలు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నందన్ యాదవ్, మరో నిందితుడు హరే రామ్ సహా మరికొందరు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఇద్దరూ ఎదురుదాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నందన్ యాదవ్ కాలికి బుల్లెట్ గాయం కాగా, హరే రామ్ కాలికి గాయమైంది. ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసులో BNSS, POCSO చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జముయి ఎస్డీపీఓ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *