Bollaram Incident

Bollaram Incident: సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూర్ ఆర్కిడ్ విల్లాస్‌లో ఐదేళ్ల చిన్నారి అరేలియా కిడ్నాప్, హత్యకు గురైంది. అగ్రికల్చర్ సైంటిస్ట్ మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అయిన అరేలియా అక్టోబర్ 9న బతుకమ్మ వేడుకల సమయంలో అదృశ్యమైంది. వారం క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్ కక్షతో చిన్నారిని కిడ్నాప్ చేసి, రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. కుటుంబ సభ్యులు వీడియో కాల్‌లో పాపను చూపించాలని కోరడంతో భయపడి, ఆమె చేతులు, కాళ్లు కట్టి, నడుముకు ఇటుకలు కట్టి క్లబ్ హౌస్ సెల్లార్‌లోని వాటర్ సంప్‌లో పడేసి హత్య చేశాడు.
చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా విక్రమ్‌కు సహకరించిన మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు, చివరకు నగర శివారులోని రైల్వే స్టేషన్ వద్ద విక్రమ్‌ను పట్టుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *