Mulugu: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నేలారిపేట గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్రూమ్ కాలనీలో పూనెం నాగరాజు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన తమ్ముడి మరణం సహజమైనది కాదని, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని మృతుడి అన్న, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసులో మృతుడి భార్య పూనెం జ్యోతి, ఆమె ప్రియుడు గుండారపు సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడితో కలిసి జ్యోతి చున్నీతో ఉరివేసి భర్తను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!



