Vizag Crime: రోజురోజుకీ సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఇన్స్టాగ్రామ్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ చోరీకి పాల్పడింది. అనారోగ్యంతో ఉన్నానని చెప్పి బాధితురాలి ఇంటికి వచ్చిన ఆమె.. కొన్ని రోజులపాటు అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులతో నమ్మకం పెంచుకుంది. అనంతరం ఇంట్లోని బంగారు, వజ్రాల ఆభరణాలను చోరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై బాధితురాలు మానేపల్లి నీరజ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్తో పాటు ఇతర వజ్రాలు, బంగారు ఆభరణాలు కనిపించడం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మి ఇంట్లో ఆశ్రయం కల్పించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
ఇన్స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!