Parents Allegedly Kill Son: గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలో కుటుంబ కలహం విషాదానికి దారితీసింది. భాస్కరరావు, విజయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు కోటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. కొల్లిపరలో ఉన్న రెండు సెంట్ల భూమిని తన పేరుపై రాయాలని కోటేశ్వరరావు తరచూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఘటన జరిగిన రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి వారితో గొడవపడ్డాడు.
కొడుకు వేధింపులు తట్టుకోలేక భాస్కరరావు కత్తితో దాడి చేయడంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో స్థానికులు వచ్చి చూడగా విషయం బయటపడింది. మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నాన్ని గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!