Double Murder At Tirupati: తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో ఉన్న టీటీడీ పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇద్దరిని కత్తులతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ గొడవలే ఈ ఘటనకు కారణమయ్యాయి. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను జంగాలపల్లికి చెందిన సునీల్ కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కానీ కొద్ది నెలల క్రితం ఎలాంటి కారణం చెప్పకుండా భార్యను వదిలేశాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. పెళ్లి వేడుకకు సునీల్ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ, తన కుమార్తె పెళ్లికి పెద్దలుగా ఉన్న మునిరత్నం, మణికంఠకు సమాచారం ఇచ్చింది. వారు సునీల్‌ను ప్రశ్నించడంతో అక్కడ వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో సునీల్, అతని తమ్ముడు, అక్క, మరో బంధువు కలిసి మునిరత్నం, మణికంఠపై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో నలుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..