Vaishak deadbody at Kannada Actress Apartment: కన్నడ నటి కృషి తాపండకు చెందిన బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌లో 33 ఏళ్ల వ్యాపారవేత్త వైశాఖ్ మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. రాజరాజేశ్వరి నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, వైశాఖ్ ఫ్లాట్‌లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో నటి కృషి తాపండ అక్కడ లేరని, ఆమె వేరే ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైశాఖ్‌కు గత కొంతకాలంగా కుటుంబ వివాదాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అలాగే అతనిపై గతంలో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ ఘటన వెనుక వ్యక్తిగత, కుటుంబ లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

కన్నడ హీరోయిన్ ఇంట్లో శవమై తేలిన 33 ఏళ్ల వ్యాపారవేత్త.. అసలెవరీ వైశాఖ్, ఆయనెలా చనిపోయారు?

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *