Trump Warns Iran

Trump warns cuba: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇరాన్ సమస్యను పరిష్కరించిన తర్వాత క్యూబాపై దృష్టి సారిస్తామని తెలిపారు. 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్ అయిన ఇంటర్ మయామి జట్టుకు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నామని, వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం బలహీనపడిందని అన్నారు. ఇప్పటికే ఇరాన్ నావికాదళానికి పెద్ద నష్టం వాటిల్లిందని కూడా చెప్పారు.

మూడు రోజుల్లో 24 ఇరాన్ నౌకలను ధ్వంసం చేయడంతో ఇరాన్ అధికారులు అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధమని తెలిపారని ట్రంప్ వెల్లడించారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందని వారికి చెప్పినట్లు తెలిపారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడంలో ఇరాన్ దౌత్యవేత్తలు సహకరించాలని సూచించారు. అలాగే క్యూబా కూడా అమెరికాతో ఒప్పందం కోసం ఎదురుచూస్తోందని, అయితే ముందుగా ఇరాన్ సమస్యను పూర్తి చేసిన తర్వాత క్యూబా విషయాన్ని పరిశీలిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

ఇరాన్‌ విషయం పూర్తయ్యాక క్యూబా సంగతి చూస్తాం: ట్రంప్ హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *