Turkish Airlines Plane Catches Fire

Turkish Airlines Plane Catches Fire: నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం కుడివైపు టైర్ల దగ్గర మంటలు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

TK726 కాల్‌సైన్‌తో వచ్చిన ఈ విమానంలో 278 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కొంతమంది ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. అత్యవసర ద్వారాల ద్వారా అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు, పొగ కనిపించిన దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా అధికారులు వెల్లడించలేదు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *