ఆదిలాబాద్: పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నవ వధువు ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఉదయం 9 గంటలకు భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె భర్త రిమ్స్ ఆవరణలోనే తుదిశ్వాస విడిచాడు. శేవడే పల్లవి (20) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు గుడిహత్నూర్ సబ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె భర్త విజయ్ (28) రిమ్స్‌లో పురుగుల మందు తాగి దారుణానికి ఒడిగట్టాడు.
మహారాష్ట్రలోని గుర్జా గ్రామానికి చెందిన పల్లవికి విజయ్‌తో మే 23న వివాహం జరిగిందని.. ఈ జంటకు ఎలాంటి వివాదాలు లేవని, హ్యాపీ వైవాహిక జీవితం గడుపుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే, పల్లవి ఇంటికి దూరంగా ఉంటూ కొల్హారిలో నివసించడానికి ఆసక్తి చూపలేదు. శుక్రవారం ఆమెను సోదరుడు ఇక్కడకు దింపాడు. క్రిమిసంహారక మందు బాటిల్ తీసుకుని స్పృహతప్పి పడిపోయిందని పోలీసులు తెలిపారు.