హైదరాబాద్: చిన్న విషయానికి భర్తతో గొడవపడి మనస్తాపం చెందిన నవ వధువు మంగళవారం చేవెళ్లలోని ఆలూరులో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గృహిణి జ్యోతి(22) ప్రైవేటు ఉద్యోగి నవీన్‌తో ప్రేమ వివాహం చేసుకుంది.
ఈరోజు భర్త, అత్తమామలు లేని సమయంలో బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపుల వల్లే జ్యోతి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. చేవెళ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు