News5am, Breaking News Telugu Updates (02-06-2025): తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు రోహిణీ కార్తెలోనే రావడంతో కొన్ని రోజులు వర్షాలు కురిశాయి. అయితే ఆ తర్వాత రుతుపవనాలు ఈశాన్య భారత వైపు మళ్లడంతో వర్షాలు తగ్గాయి. దీంతో గత రెండు మూడు రోజులు ఎండలు పెరిగి వేసవిలా వాతావరణం కనిపించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రవాహం తెలంగాణలో మందగించడం వల్ల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. కింది స్థాయిలో నైరుతి దిశ నుంచి గాలులు వీచుతున్నాయని, ఇవాళ (జూన్ 2) నుంచి రేపటి వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
మరోవైపు, ఎండలు కొద్దిగా పెరిగే అవకాశం ఉండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం, సమయంలో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉండగా, మధ్యాహ్నం ఎండ తీవ్రతగా ఉండే సూచనలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఆ తరువాత వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని, చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉందన్నారు. అలాగే జూన్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వారం రోజుల్లో మళ్లీ వర్షాలు పూర్తిగా కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
More Breaking News Telugu General:
Breaking News Telugu Updates
వాయుగుండంగా మారిని తీవ్ర అల్పపీడనం..
More Breaking News: External Sources
రోజుకో రకంగా మారుతున్న వెదర్.. మరో రెండు రోజులు వర్షాలు