First phase seat allotment: రాష్ట్రంలో బీఆర్క్ కోర్సు తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటాలోని 465 సీట్లకు 433 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, 357 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ నెల 13, 14 తేదీల్లో కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి.
ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్ట్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫిజికల్ వెరిఫికేషన్ కోసం కాలేజీలో సమర్పించాలి. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైన తర్వాత ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ జారీ చేస్తారు. నిర్ణీత గడువులోగా రిపోర్ట్ చేయకపోతే సీట్లు రద్దవుతాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…