Heavy Rain Alert: బంగాళాఖాతంలోని మలక్కా జలసంధి–దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ, నవంబర్ 26న వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుండనున్నాయి. తమిళనాడులో చెన్నై సహా పలు జిల్లాలకు, అలాగే కేరళలో కొల్లాం సహా అనేక ప్రాంతాలకు ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించారు.
ఏపీ, తెలంగాణలో ఇప్పటికి హెచ్చరికలు లేకపోయినా, వచ్చే రెండు రోజుల్లో పరిస్థితులు స్పష్టమవుతాయని తెలిపారు. ఈ వాయుగుండం తుఫానుగా మారే సూచనలు ఉండగా, దీని పేరు ‘సెన్యార్’గా నిర్ణయించారని అధికారులు చెప్పారు. గాలులు గంటకు 45–50 కిమీ వేగంతో వీయే అవకాశముండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!
భారీ లేఆఫ్స్ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!
External Links:
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్ప పీడనం : తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు