Rains

Murusu Cyclone: ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తుఫాన్ ‘మురసు’ దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ములుగు, భద్రాద్రి, వరంగల్, జనగామ, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, పంటలు కోతకు వచ్చిన సమయంలో వరుస తుఫాన్లు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అర్నబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులు, మురసు తుఫాన్ వల్ల పంటలు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నారు. ధాన్యం తడిసినా, పంటలు నేలకొరిగినా భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *