National Handloom Day

National Handloom Day: బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.179 కోట్లను విడుదల చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహించడం, నేతన్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం చేనేత కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సీఎం ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేటకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు జాండ్రపేటలోని చేనేత వర్క్‌షాప్‌ను సందర్శించి ‘నేతన్న సేవలో’ పథకం లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. తర్వాత మధ్యాహ్నం 4.10 గంటలకు కొత్తపేటలో టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు క్యాంపు కార్యాలయానికి తిరిగి చేరుకుంటారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *