Conductor Pravallika: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం బస్సులో టికెట్ విషయంలో ఓ ప్రయాణికురాలితో జరిగిన గొడవలో ప్రవళికను ఆమె తోసేయడంతో ప్రమాదవశాత్తు బస్సు టైర్ల కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట స్థానికంగా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.
ప్రవళిక మృతితో మణుగూరు డిపోతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, ప్రవళిక తల్లికి ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..