Tg Eapcet 2026 Final Phase

Tg Eapcet 2026 Final Phase: టీజీఈఏపీసెట్–2026 (TG EAPCET 2026) ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తైంది. ఈ ఏడాది మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 75,054 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 19,102 సీట్లు ఖాళీగా ఉండటంతో మొత్తం సీట్ల భర్తీ శాతం 80గా నమోదైంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5,771 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 7లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.

ఈసారి విద్యార్థులు ఎక్కువగా ఏఐ, ఐటీ సంబంధిత కోర్సులను ఎంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీఎస్ నెట్‌వర్క్స్, రోబోటిక్స్ & ఏఐ కోర్సుల్లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సుల్లో మొత్తం 82% సీట్లు నిండగా, సైబర్ సెక్యూరిటీలో 92%, సీఎస్‌ఈ (ఏఐ & ఎంఎల్)లో 86%, సీఎస్‌ఈలో 84%, ఐటీలో 80%, డేటా సైన్స్‌లో 79% సీట్లు భర్తీ అయ్యాయి. కోర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఈసీఈలో 79%, సివిల్‌లో 69%, ఈఈఈలో 65%, మెకానికల్‌లో 64% సీట్లు భర్తీ అయ్యాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *