హైదరాబాద్: రాజేంద్రనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో కారును వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
చిలుకూరు నుంచి రాజేంద్రనగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డులో వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మూడేళ్ల చిన్నారి సమీరా ఫాతిమా అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్నవారు హైదరాబాద్ పాతబస్తీలోని నవాబ్ సాహబ్ కుంట వాసులుగా గుర్తించారు.కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.