Mutta Kalakki Hits: జి.వి. ప్రకాష్ కుమార్ తన సంగీతంతో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన తమిళ యువత చిత్రం ‘యూత్’లోని ‘ముట్ట కలక్కి’ పాట భారీ హిట్ అయింది. కెన్ కరుణాస్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ఈ పాట తక్కువ సమయంలోనే 158 మిలియన్ల వ్యూస్ దాటి, 2026లో తమిళంలో అత్యధిక వ్యూస్ సాధించిన నంబర్ 1 సాంగ్‌గా నిలిచింది. కెన్ కరుణాస్ పాడిన ఈ పాటలోని బీట్స్, ఎనర్జీ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘NEEK’ సినిమాలోని ‘గోల్డెన్ స్పారో’ పాట 2025లో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే స్థాయిలో ‘ముట్ట కలక్కి’ కూడా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, డ్యాన్స్ వీడియోలతో ఈ పాట వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్న జి.వి. ప్రకాష్ వరుసగా హిట్ పాటలతో తన క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’