Singer Asha Bhosle: భారతీయ సంగీత ప్రపంచానికి పెద్ద నష్టం జరిగింది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. నీరసం, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి ఐసీయూలో చికిత్స చేసినా ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె పార్థివ దేహాన్ని సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు నివాసంలో ఉంచి, సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ సోదరి. 1933 సెప్టెంబర్ 8న జన్మించిన ఆమె 1943లో సంగీత ప్రయాణం ప్రారంభించారు. ఎనిమిది దశాబ్దాల కెరీర్‌లో 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించారు. తెలుగులో కూడా ఆమె ఎన్నో హిట్ పాటలు పాడారు. ఆమె మరణం భారత సంగీత ప్రపంచానికి తీరని లోటు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే