Ustad Bhagat Singh Movie: హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయింది. ఇతర నటీనటులతో కూడిన సన్నివేశాలను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 9న ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేయనున్నారని, అందులో పవన్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ కనిపిస్తాయని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, భాస్కరభట్ల లిరిక్స్ రాశారు, విశాల్ దద్లాని ఈ పాటను పాడారు.
ప్రోమోకు విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తుండగా, సమ్మర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్–హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఈలలు వేయడం గ్యారెంటీ.. పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా నుంచి క్రీజీ అప్‌డేట్