Operation Sindoor Six Indian Soldiers: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన ఆరుగురు జవాన్ల పేర్లను ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. ఆర్మీ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వారి వివరాలను నమోదు చేసింది. వీరిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్, వైమానిక దళానికి చెందిన సర్జెంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు. వీరి పేర్లను 2025 రోల్ ఆఫ్ ఆనర్ జాబితాలో చేర్చారు. అలాగే రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం వీరచక్ర, సర్జెంట్ సురేంద్ర కుమార్‌కు వాయుసేన మెడల్ ప్రకటించారు.
2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ శాంతి చర్చలు కోరగా, ఇరుదేశాల డీజీఎంఓల మధ్య జరిగిన చర్చల తర్వాత 2025 మే 10 నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్‌స్క్రిప్షన్స్ కూడా..