Telangana Employees One Crore

Telangana Employees One Crore: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పెద్ద ఊరటనిచ్చింది. ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఉద్యోగులందరికీ గరిష్టంగా రూ.1 కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సింగరేణి సంస్థకు చెందిన 45 మంది కార్మికులకు ఈ బీమా సదుపాయం అమలు చేసినట్లు తెలిపారు. అలాగే రాజకీయ విమర్శలకు స్పందిస్తూ, తనను “రేవంతన్న” అని పిలవడమే తనకు ఎంతో ఆనందమని, పదవులు మారినా ఆ పిలుపు మాత్రం శాశ్వతంగా ఉంటుందని అన్నారు.

రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పని చేయాలని సీఎం కోరారు. పన్నులు చెల్లించకుండా తప్పించుకునే వారిని గుర్తించి, ట్యాక్స్ బకాయిలను కఠినంగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం వడ్డీ రేట్లను 11 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించిందని చెప్పారు. అలాగే మూసీ నది అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు (RRR), మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *