Gst Ai Reforms: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమైన సీఎం.. జీఎస్టీ ఆదాయం పెంపు, పన్నుల ఎగవేత నియంత్రణపై చర్చించారు. పన్నుల వసూళ్లను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించారు. వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా పన్నుల వ్యవస్థను సులభతరం చేయనున్నారు.
భవన నిర్మాణ రంగంలో పన్నుల లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐతో అనుసంధానం చేయనున్నారు. నిర్మాణ అనుమతుల దశలోనే పన్నుల వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ వంటి పథకాల సమాచారాన్ని కూడా ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..