Khelo India Youth Games 2026: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పోటీల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరులో జరగనున్న ఈ పోటీల కోసం హైదరాబాద్‌లోని స్టేడియంలను పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులు, ముఖ్య అతిథులను భాగస్వాములను చేసేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథుల సౌకర్యాల కోసం అధికారులకు బాధ్యతలు విభజించి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్, జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని తెలిపారు. మొత్తం 20 క్రీడల్లో పోటీలు జరగనున్నందున ప్రతి క్రీడకు తగిన వేదికలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!