Telangana Police Recruitment Exams: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ నియామకాలను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతను మరింత పెంచాలని, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని, నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు