Ktr Slams Telangana Government: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ యువత తీవ్ర నిరాశలో ఉందని, జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన నియామకాలను కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అలవాటైందన్నారు.
ఖమ్మం విద్యార్థి వేణు ఆత్మహత్యాయత్నం ఘటనను ప్రస్తావించిన కేటీఆర్, అతడి లేఖ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌లాంటిదని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను గుర్తు చేస్తూ, వాటిని వెంటనే అమలు చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!