DY Chandrachud

DY Chandrachud: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంతర్జాతీయ న్యాయ వేదికపై కీలక బాధ్యత చేపట్టనున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓస్చాడ్‌బ్యాంక్ రష్యాపై దాఖలు చేసిన అంతర్జాతీయ వివాదంలో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా ఆయన నియమితులయ్యారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో తమ ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలు కోల్పోయి వందల మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని ఓస్చాడ్‌బ్యాంక్ ఆరోపిస్తోంది. 1998 రష్యా-ఉక్రెయిన్ పెట్టుబడుల ఒప్పందం కింద పరిహారం కోరుతూ బ్యాంక్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది.

ఈ కేసు విచారణ కోసం ముగ్గురు సభ్యులతో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కోస్టారికా మాజీ వాణిజ్య మంత్రి డయాలా జిమెనెజ్‌ను ఇరుపక్షాలు ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఎంపిక చేశాయి. ఓస్చాడ్‌బ్యాంక్ తరఫున స్టావ్రోస్ బ్రేకౌలాకిస్‌ను, రష్యా తరఫున జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించారు. గతంలో కూడా రష్యా కొన్ని ఇతర వివాదాల్లో ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలని చంద్రచూడ్‌ను కోరినప్పటికీ ఆయన తిరస్కరించారు. అయితే ఓస్చాడ్‌బ్యాంక్ కేసులో రష్యా చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించడం విశేషం.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *