Irumudi Trailer

Irumudi Trailer:  మాస్ మహారాజ్ రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో రవితేజ త్రినాథ్ పాత్రలో కనిపిస్తున్నారు. కూతురంటే ఎంతో ప్రేమించే త్రినాథ్.. ఏటా 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపడతాడు. అయితే ఊరిలో బాలికలు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ కేసు వెనుక ఉన్నవారిని ఎదుర్కొనేందుకు పోరాటం మొదలుపెడతాడు.

అతడు దీక్షలో ఉన్న సమయంలోనే నేరస్థులు తమ పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం కథలో ఆసక్తిని పెంచుతోంది. తండ్రి–కూతురు అనుబంధం, భక్తి, మిస్టరీ, యాక్షన్, ఎమోషన్ కలయికగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

 కూతురి కోసం తండ్రి పోరాటం.. రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ అదిరింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *