Revanth Reddy Assembly Challenge

Revanth Reddy Assembly Challenge: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా బీఆర్ఎస్‌ను, తనను విమర్శించకుండా ఉండరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే ఆలోచిస్తున్నారంటే ఆయనకు ఆ పార్టీపై ఎంత భయం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. తన ఎత్తు, జగదీష్ రెడ్డి శరీరాకృతిపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ, వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. తమకు అలాంటి సంకుచిత మనస్తత్వం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే సీఎం దృష్టి పెట్టాలని సూచించారు. అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రులు నిర్వహించిన సమావేశం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను ప్రభుత్వం కాపాడాలని అన్నారు. అలాగే 2028 నుంచి 2034 వరకు కాంగ్రెస్‌నే అధికారంలో ఉంటుందని సీఎం చెప్పడాన్ని ఆయన విమర్శించారు. నిజంగా ప్రజల మద్దతు ఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి బలం ఎంత ఉందో ప్రజలే నిర్ణయిస్తారని హరీష్ రావు అన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *