EPFO Services Interruption: దేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులు ఉపయోగించే ఈపీఎఫ్‌ఓ (EPFO) ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. సిస్టమ్ అప్‌గ్రేడ్, డేటా మైగ్రేషన్ పనుల కారణంగా జూన్ 26 నుంచి 29 వరకు సభ్యుల పోర్టల్, యజమానుల పోర్టల్, ఉమంగ్ యాప్‌లోని పలు కీలక సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో పీఎఫ్ క్లెయిమ్‌లు దాఖలు చేయడం, క్లెయిమ్ ప్రాసెసింగ్, ఈ-పాస్‌బుక్ వీక్షణ, కొత్త యూఏఎన్ లింకింగ్, ఈసీఆర్ ఫైలింగ్ వంటి సేవలు నిలిచిపోతాయి.
సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా అందించేందుకు ఈ మార్పులు చేపడుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. జూన్ 30 నుంచి సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని సేవలు జులై 2 వరకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో సభ్యులు, యజమానులు తమ అవసరమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ సూచించింది. ఏవైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నంబర్ 14470ను సంప్రదించాలని తెలిపింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
ఉద్యోగులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్!