Latest rates of silver and gold: గత రెండు వారాలుగా బంగారం ధరలు తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్లో మళ్లీ డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండగా, పెరుగుతున్న ధరలు సాధారణ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీకెండ్‌లో బంగారం కొనాలని భావిస్తే, ముందుగా మీ నగరంలోని తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.
ఆగస్టు 7న బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఆగస్టు 6తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.16 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో రూ.14,989గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.13,740గా కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేజీ స్వచ్ఛమైన వెండి ధర రూ.2,50,000గా ఉండగా, గ్రాము వెండి ధర సుమారు రూ.250గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
మళ్ళీ భగ్గుమన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!