New Pensions: తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కొత్త పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు అప్పగించారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీ పూర్తి చేసి, అర్హులైన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..