Red Alert For Heavy Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కోస్తాంధ్ర, యానాంలో గంటకు 50–60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. వంశధార, నాగావళి నదుల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!