Flash Flood Alerts: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, పార్వతీపురం మన్యం, తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటి, మరో 12 గంటలు తీవ్ర వాయుగుండంగా కొనసాగి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉంది. మరో 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరంలో పంట పొలాలు నీటమునిగాయి. అల్లూరి జిల్లాలో రహదారి దెబ్బతింది. విశాఖలో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై రహదారులు దెబ్బతిన్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!