Rains

Coastal Districts Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. ముఖ్యంగా ఏలూరు నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఆవర్తనం ఉంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. కోస్తా తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

ఉద్యోగులకు అలర్ట్‌.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *