Pm Modi Completes 12 Years

Pm Modi Completes 12 Years: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రెండు ముఖ్యమైన రాజకీయ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి ఎక్కువ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా అభినందించనున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ప్రధానిగా మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *