Ap Reorganisation Amendment Bill: ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు నేడు రాజ్యసభలో చర్చకు రానుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఈ బిల్లుపై చర్చ జరగనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందే అవకాశాలు ఉండటంతో, అమరావతికి చట్టబద్ధత దిశగా మరో కీలక అడుగు పడనుంది.

ఈ చర్చను వీక్షించేందుకు మంత్రి నారా లోకేష్ పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. వివిధ పార్టీల నేతలు ఈ చర్చలో పాల్గొననున్నారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి వైవీ స్యువ్వ రెడ్డి, టీడీపీ నుంచి రామ్ మోహన్ నాయుడు, బీజేపీ నుంచి కే లక్షణ్ మాట్లాడనున్నారు. ఈ చర్చ ఏపీ భవిష్యత్‌కు కీలకం కావడంతో ప్రజల్లో ఆసక్తి ఉంది. అలాగే, నారా లోకేష్ ఈ రోజు ఉదయం ప్రధాని మోదీని కలసి అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *