CM Revanth Team: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జూలై 24న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసింది. ఈ భేటీలో రాష్ట్రంలో జరిగిన కులగణన, బీసీ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ గురించి వివరించారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, కులగణన ప్రక్రియ, బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఢిల్లీ నేతలకు వివరాలు అందించారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలన్న దిశగా ఒత్తిడి అవసరమని రేవంత్ బృందం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ కులగణనపై విస్తృతంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం బీసీ బిల్లు ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ అసెంబ్లీలో ఓటేస్తూనే బీసీ బిల్లుపై ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం విడ్డూరమన్నారు. బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం మోసంగా అభివర్ణించారు.
Internal Links:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బరాబర్ అమలు చేస్తాం..
కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది..
External Links:
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఒప్పుకోకపోతే దేశ వ్యాప్త ఆందోళన