Delhi Tour

Delhi Tour: తెలంగాణ రాజకీయ నేతలు ఢిల్లీలో బిజీ షెడ్యూల్‌తో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 10:30కి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించనున్నారు. సాయంత్రం, ఎఐసీసీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలకు సర్వే విధానం, ఉద్యోగుల పాల్గొనడంపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

ఇక మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గోల్లపల్లి రామచంద్రరావు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర విభాగాల్లో నెలకొన్న అసంతృప్తిని పరిష్కరించే మార్గాలు, బండి సంజయ్–ఈటల రాజేందర్ మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ బలపర్చే కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాకు రిపోర్ట్ అందించనున్నారని తెలుస్తోంది.

Internal Links:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బరాబర్ అమలు చేస్తాం..

కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది..

External Links:

ఢిల్లీలో బిజీబిజీగా తెలంగాణ నేతలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *